Ugadi 2023 | శోభకృత నామ సంవత్సరంలో నిత్యవసర ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Ugadi 2023 | ఈ నెలలో నువ్వులు, పెసలు, కందులు, పూల ధరలు పెరుగుతాయి. నూలు, పత్తి ధరలు నెల మొదట్లో పెరిగి మధ్యలో తగ్గి, మాసాంతంలో మళ్లీ పెరుగుతాయి. బంగారం, వెండి ధరలు సామాన్యంగా ఉంటాయి. కూరగాయలు, నూనె, బెల్లం, ఇనుము, సిమెంట్, గృహనిర్మాణ సామగ్రి ధరలు నిలకడగా ఉంటాయి.
Ugadi 2023 | చైత్రం
ఈ నెలలో నువ్వులు, పెసలు, కందులు, పూల ధరలు పెరుగుతాయి. నూలు, పత్తి ధరలు నెల మొదట్లో పెరిగి మధ్యలో తగ్గి, మాసాంతంలో మళ్లీ పెరుగుతాయి. బంగారం, వెండి ధరలు సామాన్యంగా ఉంటాయి. కూరగాయలు, నూనె, బెల్లం, ఇనుము, సిమెంట్, గృహనిర్మాణ సామగ్రి ధరలు నిలకడగా ఉంటాయి. ఆలుగడ్డ ఇతర దుంపల ధరలు తగ్గుతాయి.
వైశాఖం
నువ్వులు, కూరగాయలు, పండ్లు, పూలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కలప, పచ్చిమిర్చి, అరటి, కొబ్బరి, నూనె ధరలు పెరుగుతాయి. చక్కెర, బెల్లం ధరలు నిలకడగా ఉంటాయి. ఇనుము, సిమెంటు, గృహోపకరణాలు, కందులు, గోధుమలు, జొన్నల ధరలు స్థిరంగా ఉంటాయి.
జ్యేష్ఠం
బంగారం, వెండి ధరల్లో పెద్దగా వ్యత్యాసం ఉండదు. బియ్యం, పప్పుధాన్యాల ధరలు స్వల్పంగా తగ్గుతాయి. తమలపాకులు, పూలు, కూరగాయలు, నువ్వుల ధరలు అందుబాటులో ఉంటాయి. యంత్రసామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్టీలు, పత్తి, నూలు, ఇత్తడి, ధనియాలు, ఆవాలు, మిర్చి ధరలు పెరుగుతాయి.
ఆషాఢం
పుత్తడి, ఇత్తడి ధరలు కొంత తగ్గుతాయి. కూరగాయలు, పూల ధరలు అందుబాటులో ఉంటాయి. ధాన్యం, పత్తి, పప్పుధాన్యాలు, ఉలవలు, పెసర్లు, నూనెలు, కొబ్బరి, స్టీలు, బెల్లం ధరలు నిలకడగా ఉంటాయి.
అధిక శ్రావణం
ధాన్యం ధరలు తగ్గుతాయి. మిర్చి, పసుపు, కూరగాయలు ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరుగుతుంది. నువ్వులు, చింతపండు, ఆలుగడ్డ, అరటిపండ్లు, కొబ్బరికాయల ధరలు నిలకడగా ఉంటాయి. పాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి.
నిజ శ్రావణం
రెడీమేడ్ దుస్తుల ధరలు పెరుగుతాయి. బంగారం, వెండి ధరలు నిలకడగా ఉంటాయి. బెల్లం, ఉల్లిగడ్డలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, పూల ధరల్లో పెద్దగా వ్యత్యాసం ఉండదు.
భాద్రపదం
బంగారం, వెండి, చెరకు, వడ్లు, ఆవాలు, గోధుమలు, మినుములు, పెసర్లు, అరటి, పసుపు ధరలు పెరుగుతాయి. కొబ్బరికాయ, చింతపండు, చక్కెర, బెల్లం, రాగి, ఇత్తడి ధరలు తగ్గుతాయి. మిర్చి ధర స్థిరంగా ఉంటుంది.
ఆశ్వయుజం
నువ్వులు, శనగలు, గోధుమలు, వడ్ల ధరలు తగ్గుతాయి. బంగారం, వెండి, పసుపు, యంత్ర సామగ్రి, స్టీలు ధరలు పెరుగుతాయి. నూలు, పత్తి, బెల్లం, మిర్చి, చింతపండు, నూనె, ఆవాలు, మినుములు, పెసలు, ఉలవల ధరలు తగ్గుతాయి.
కార్తికం
ఎలక్ట్రిక్ వస్తువులు, కలప, వడ్లు, బంగారం, వెండి, ఇనుము, ఇత్తడి, రాగి ధరలు పెరుగుతాయి. పండ్లు, పూలు, పాలు, నెయ్యి, కూరగాయల ధరలు నిలిచి ఉంటాయి. అలంకార వస్తువులు, సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గుతాయి.
మార్గశిరం
ధాన్యం ధరలు తగ్గుతాయి. పూలు, పండ్లు, కాగితం ధరలు పెరుగుతాయి. వైద్య ఉపకరణాలు, ఔషధాల ధరలు పెరుగుతాయి. మిర్చి, చింతపండు, బెల్లం, నెయ్యి, నూనె, ఇనుము, పట్టు దుస్తుల ధరలు స్థిరంగా ఉంటాయి.
పుష్యం
ధాన్యం ధర తగ్గుతుంది. బంగారం, నూలు దారం, పసుపు, అల్లం, మిర్చి, బెల్లం, చక్కెర, కూరగాయలు, పాలు, నెయ్యి, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల ధరలు పెరుగుతాయి. కొబ్బరికాయల ధరలు స్థిరంగా ఉంటాయి.
మాఘం
బంగారం, కందులు, సిమెంటు, ఆవాలు, కొబ్బరికాయల ధరలు పెరుగుతాయి. గోధుమలు, వడ్లు, మిర్చి, మిరియాలు, చింతపండు ధరలు తగ్గుతాయి. రెడీమేడ్ దుస్తులు, పట్టు వస్ర్తాలు, చక్కెర, కూరగాయల ధరలు నిలకడగా ఉంటాయి. పసుపు, పొగాకు, కందులు, అరటి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఫాల్గుణం
బంగారం, నూలు, పట్టువస్ర్తాలు, చక్కెర, బెల్లం, చింతపండు, పొగాకు, జొన్నల ధరలు పెరుగుతాయి. కందులు, మిర్చి, మిరియాలు, యంత్రసామగ్రి, సుగంధ ద్రవ్యాలు, నూనె, పాల ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉంటాయి.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

