Ugadi Panchangam 2024 | మిథునం రాశి ఫలాలు
ఈ రాశివారికి గురువు లాభంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా వ్యయంలో ఉంటాడు. భాగ్యంలో శని, రాజ్యంలో రాహువు, చతుర్థంలో కేతువు సంచరిస్తారు. గురువు, శని అనుకూల ఫలితాలు ఇస్తారు. రాహుకేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనతో శుభఫలితాలు పొందుతారు.
మిథునం మృగశిర 3,4 ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఆదాయం: 5
వ్యయం: 5
రాజపూజ్యం: 3
అవమానం: 6
చైత్రం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. అనవసరమైన ఖర్చుల వల్ల మనశ్శాంతి లోపించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి.
వైశాఖం: ఈ నెలలో గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తి పెరుగుతుంది. బంధు మిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సలహాలను పాటిస్తారు. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు.
జ్యేష్ఠం: రావలసిన డబ్బు వస్తుంది. బాకీలు తీర్చి ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. భూమి కొనుగోలు కలిసి వస్తుంది.
ఆషాఢం: అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. వాహన మరమ్మతులు ముందుకురావచ్చు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణతోపాటు ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం.
శ్రావణం: విద్యార్థులు శ్రమించ వలసిన సమయం. ఉద్యోగులకు పనిచేసే చోట పరపతి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులపై మనసు నిలపడం మంచిది.
భాద్రపదం: ఈ నెల అన్ని విషయాల్లో జాగ్రత్త పాటించడం అవసరం. అశ్రద్ధ మూలంగా నష్టాలు ఎదురుకావచ్చు. మనశ్శాంతి కరువవుతుంది. ఓపికతో ముందుకు వెళ్లడం అవసరం. బంధువులు, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ, మనస్పర్ధలు తలెత్తవచ్చు.
ఆశ్వీయుజం: వ్యాపారులకు భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తారు.
కార్తీకం: ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక ఒప్పందాలలో ఏమరుపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భూలావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి.
మార్గశిరం: ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. సహోద్యోగులతో స్నేహం కుదురుతుంది. మిత్రులతో పనులు నెరవేరుతాయి. బాధ్యతలు శ్రద్ధతో పూర్తిచేస్తారు.
పుష్యం: విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆలోచించి పనిచేయడం మంచిది.
మాఘం: మాట పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి.
ఫాల్గుణం: ప్రారంభించిన పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సోదరులు, బంధువుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి ద్వారా ఆదాయం వస్తుంది.
- ఈ రాశివారికి గురువు లాభంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా వ్యయంలో ఉంటాడు. భాగ్యంలో శని, రాజ్యంలో రాహువు, చతుర్థంలో కేతువు సంచరిస్తారు. గురువు, శని అనుకూల ఫలితాలు ఇస్తారు. రాహుకేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనతో శుభఫలితాలు పొందుతారు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

