Ugadi Panchangam 2024 | కర్కాటక రాశివారికి ఆదాయం 14.. అవమానం..
ఈ రాశివారికి గురువు రాజ్యంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా లాభంలో ఉంటాడు. అష్టమం శని, భాగ్యంలో రాహువు, తృతీయంలో కేతువు సంచరిస్తారు. గురువు, రాహువు, కేతువు అనుకూల ఫలితాలు ఇస్తారు. శని చికాకులు కలిగిస్తాడు. శివారాధనతో శుభఫలితాలు పొందుతారు.
కర్కాటకం పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 14
వ్యయం: 2
రాజపూజ్యం: 6
అవమానం: 6
చైత్రం: పట్టుదలతో పనిచేయడం అవసరం. ఖర్చులను దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు.
వైశాఖం: అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రుణ భారం పెరుగుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూల సమయం.
జ్యేష్ఠం: కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నెలాఖరులో ఇంట్లో అనవసరమైన చర్చలతో వివాదాలు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
ఆషాఢం: పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా మసులుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
శ్రావణం: విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ విద్యకు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. పనులు అనుకున్న సమయంలో పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలపై దృష్టి నిలుపుతారు.
భాద్రపదం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం మూలంగా మనశ్శాంతి లోపించవచ్చు. వ్యాపారులు సమయానుకూల పెట్టుబడులతో లాభాలు గడిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి.
ఆశ్వీయుజం: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యంపై మనసు నిలపడం అవసరం. విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తే మంచి ఫలితాలను పొందుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి.
కార్తీకం: ఆదాయం పెరగడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. రుణబాధల నుంచి విముక్తులు అవుతారు.
మార్గశిరం: సమయానుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి.
పుష్యం: ఈ మాసంలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను నియంత్రించడం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.
మాఘం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు.
ఫాల్గుణం: ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. విదేశీ ప్రయాణాలకు, పై చదువులకు అనుకూలం. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
- ఈ రాశివారికి గురువు రాజ్యంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా లాభంలో ఉంటాడు. అష్టమం శని, భాగ్యంలో రాహువు, తృతీయంలో కేతువు సంచరిస్తారు. గురువు, రాహువు, కేతువు అనుకూల ఫలితాలు ఇస్తారు. శని చికాకులు కలిగిస్తాడు. శివారాధనతో శుభఫలితాలు పొందుతారు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

