Ugadi Panchangam 2024 | మేషం రాశి వారికి ఎంత ఆదాయ, వ్యయాలు ఉన్నాయంటే..
గురువు జన్మరాశి (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా ద్వితీయంలో ఉంటాడు. లాభంలో శని, వ్యయంలో రాహువు, ఆరింట కేతువు సంచరిస్తారు. గురువు, శని, కేతువు అనుకూల, రాహువు ప్రతికూల ఫలితాలు ఇస్తారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
మేషం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం: 8
వ్యయం: 14
రాజపూజ్యం: 4
అవమానం: 3
చైత్రం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. అయితే రాహువు, శని మార్పు వల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ఆదాయం పెరుగుతుంది.
వైశాఖం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. మంచి-చెడు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోవడం మంచిది.
జ్యేష్ఠం: ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరినప్పటికీ, వృథా ఖర్చులు ఉంటాయి. కుటుంబ పెద్దల సలహాలు పాటించండి. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ఆషాఢం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అప్పుల బాధ తప్పుతుంది. బాధ్యతలను చాకచక్యంగా నిర్వహిస్తారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
శ్రావణం: సహోద్యోగులతో వైరం ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. అధికారుల ఒత్తిడి వల్ల మనశ్శాంతి కరువవుతుంది. బదిలీ అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
భాద్రపదం: అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. నిర్మాణ కార్యక్రమాలు, భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు.
ఆశ్వీయుజం: వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. రాజకీయ నాయకులకు మంచి సమయం.
కార్తీకం: వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అధికారులు పనితనాన్ని గుర్తిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది.
మార్గశిరం: తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. తోటివారి విమర్శలతో ఇబ్బంది పడతారు. రాబడి బాగుంటుంది.
పుష్యం: విద్యార్థులకు అనుకూల సమయం. ఫలితాలు ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది కారణంగా సమస్యలు ఎదురుకావొచ్చు.
మాఘం: ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి
ఫాల్గుణం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బయట సమస్యలు ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ, చేసే పనిమీద మనసుపెట్టండి. ఆత్మీయులు, మిత్రులతో కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.
- గురువు జన్మరాశి (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా ద్వితీయంలో ఉంటాడు. లాభంలో శని, వ్యయంలో రాహువు, ఆరింట కేతువు సంచరిస్తారు. గురువు, శని, కేతువు అనుకూల, రాహువు ప్రతికూల ఫలితాలు ఇస్తారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

