25-11-2022 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
Horoscope | వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది.
మేషం
వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.
వృషభం
మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం
మిథునం
కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధల తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
కర్కాటకం
ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
సింహం
కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
కన్య
రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
తుల
ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
వృశ్చికం
మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
ధనుస్సు
పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు.
మకరం
అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు.
కుంభం
అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం
విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

