27-04-2022 బుధవారం.. మీ రాశి ఫలాలు
Horoscope | విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
మేషం
విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
వృషభం
తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
మిథునం
ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.
కర్కాటకం
ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణబాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగిఉంటారు.
సింహం
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవదర్శనం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
కన్య
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆతమ్మీయుల సహాయసహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.
తుల
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
వృశ్చికం
ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
ధనుస్సు
నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు.
మకరం
చంచలంలో అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.
కుంభం
రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పినికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
మీనం
ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

