చెవిలో చీము ప్రమాదకరమా?
పిల్లల్లో జలుబు తర్వాత శ్వాస వ్యవస్థకు వచ్చే సర్వ సాధారణ రుగ్మత ఇది. కొన్నిసార్లు ఇతర వ్యాధులకు తీసుకునే మందుల ప్రభావంతో దానంతట అదే తగ్గిపోవచ్చు. మన చెవిని మూడు భాగాలుగా విభజిస్తారు.. బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. చీము ఎక్కువగా మధ్య చెవిలో వస్తుంది.
మా పాపకు గత వారం రోజుల నుంచీ చెవిలో చీము కారుతున్నది. దీంతోపాటు జలుబు, దగ్గు కూడా ఉన్నాయి. ఈ సమస్యకు కారణాలేమిటి? నివారణ మార్గాలు చెప్పండి. – ఓ పాఠకురాలు
పిల్లల్లో జలుబు తర్వాత శ్వాస వ్యవస్థకు వచ్చే సర్వ సాధారణ రుగ్మత ఇది. కొన్నిసార్లు ఇతర వ్యాధులకు తీసుకునే మందుల ప్రభావంతో దానంతట అదే తగ్గిపోవచ్చు. మన చెవిని మూడు భాగాలుగా విభజిస్తారు.. బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. చీము ఎక్కువగా మధ్య చెవిలో వస్తుంది. అప్పుడప్పుడూ బయటి చెవిలోనూ వస్తుంది. గొంతు నుంచి మధ్య చెవికి విస్తరించిన ‘యూ స్టేషియన్ నాళం’ ద్వారా బ్యాక్టీరియా వ్యాపించడం వల్ల చీము సమస్య ఉత్పన్నం అవుతుంది. ముఖ్యంగా 6 నుంచి 20 నెలల వయసు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. బాలికలతో పోల్చినప్పుడు బాలురకు తరచుగా వస్తుంది. తక్కువ వయసు పిల్లలకు వస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. తీవ్రతా ఎక్కువే. తిరగబెట్టే అవకాశం అధికమే. కిక్కిరిసిన నివాసాలలో, అపరిశుభ్ర పరిసరాలలో నివసించే వారిలో తరచూ కనిపిస్తుంది. ప్రత్యేకించి వానకాలంలో, చలికాలంలో దాడిచేస్తుంది. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, హెచ్.ఇన్ఫ్లుయెంజా దీనికి ప్రధాన కారకాలు. మీజిల్స్ లేదా తట్టు వచ్చినవారిలోనూ కనిపిస్తుంది. వైద్యం ఆలస్యమైతే అనేక సమస్యలకు దారితీస్తుంది. చెవిలోని చీము తల ఎముకలకు, లోపలి మెదడుకు వ్యాపించవచ్చు. ఏడో కేంద్రనాడి పక్షవాతానికి గురైతే.. ముఖ కండరాలు సరిగా పనిచేయవు. దీంతో మూతి వంకర అవుతుంది. కనురెప్పలు మూతపడవు. ఆహారం నమలడం కష్టం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చెముడుకు ఇదో ప్రధాన కారణం. ఫలితంగా మాటలు సరిగా రాకపోవడం, భాషాపరమైన ఇతర లోపాలూ ఏర్పడవచ్చు. సరైన వైద్యంతో కర్ణభేరికి పడిన చిన్నచిన్న రంధ్రాలు మూసుకుపోతాయి. చీము కారుతున్నప్పుడు, మెత్తని దూదితో చేసిన వత్తులతో చీమును 3-4 సార్లు శుభ్రం చేయాలి. మార్కెట్లో లభించే బడ్స్ వాడటం వల్ల, చెవిలో చీము ఇంకా లోపలికి వెళ్లవచ్చు. స్నానం చేస్తున్నప్పుడు చెవిలోకి నీరుపోకుండా దూది ఉంచడం మంచిది. వైద్యుల సలహాతో
యాంటిబయాటిక్స్ వాడాలి.
-డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి ,పిల్లల వైద్య నిపుణులు, సికింద్రాబాద్.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- ears
- respiratory system
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఐఎన్ఎస్ విక్రాంత్‌పై.. రాఫెల్ మెరైన్ తొలి ల్యాండింగ్ అండ్ టేకాఫ్
Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

