నెలవంక సాక్షిగా
బతుకు పాటకు పల్లవి కడుతూ ఎన్నో దేశాలు దాటి నువ్వు వెళ్ళిపోయావు ఇక్కడొక పక్షి ఊరిలో తప్పిపోయింది
బతుకు పాటకు పల్లవి కడుతూ
ఎన్నో దేశాలు దాటి
నువ్వు వెళ్ళిపోయావు
ఇక్కడొక పక్షి ఊరిలో తప్పిపోయింది
ఇక్కడి పొద్దుమాపు మసీదు
గొంతెత్తిన ప్రార్థన అవుతుంటే
అక్కడ నీకు పొలమారుతూ ఉంటుంది
దసరా నాడు ఊరంతా
పాలపిట్ట దర్శనానికై పరుగెడుతుంటే
నాకు మాత్రం
నీ దర్శనం కానిదే దసరా ఎక్కడిది
నీ రంజాను పండుగకు
నా అలాయ్ బలాయే కదా షీర్ ఖుర్మా
చెరువుకట్ట మీద పొలం గట్ల వెంట
నువ్వు నేను నడిచిన సాయంత్రాలు
ఊర్లోకి పిల్లనెమళ్ళు వచ్చిన సంబురాలు
ఎన్నో సముద్రాలు దాటించి
పండుగ పూట పరమాన్నం పంచుకోలేని
మీ అయ్యా మా అయ్యా
ఎంతటి బుద్ధిమంతులు
నువ్వో దిక్కు నేనో దిక్కు
స్నేహ గీతాలు అల్లుకుంటూ
కలుసుకునే దారులు వెతుకుతున్న
ఈ ఎడారి ఎదురుచూపు
వసంతమయ్యేది ఎన్నడు మిత్రమా.
గజ్జెల రామకృష్ణ: 89774 12795
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- Crescent Moon
- witness
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

