బర్త్‌డే కేక్‌ను కత్తితో కోసిన యువకులు అరెస్ట్

ముంబై: బర్త్‌డే కేక్‌ను కత్తితో కోసిన యువకులతోపాటు దానిని తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. గత నెలలో రితేష్ పేకే, ఆదిత్య నలవాడే అనే ఇద్దరు యువకులు జనతా వాసహత్లో బర్త్‌డే కేక్‌ను కత్తితో కోశారు. కొడవలి మాదిరి పదునైన ఆయుధాలను చేతిలో పట్టుకుని హంగామా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పోలీసుల దృష్టికి వచ్చింది.
దీంతో పదునైన ఆయుధాలు కలిగి ఉన్నారన్న నేరంపై దత్తవాడి పోలీసులు శుక్రవారం రాత్రి ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. కత్తితోపాటు వారి వద్ద ఉన్న 7 ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తయారు చేసిన భోర్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ పవార్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు యువకులు మరో నాలుగు ఆయుధాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు అతడు చెప్పాడు.
కాగా, పదునైన పరికరాలను తయారు చేయడం, అమ్మడం నేరం కాదని, అయితే వాటిని ఎవరికి అమ్మారన్న వివరాలను రికార్డు చేయకపోవడం నేరం కిందకు వస్తుందని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

