స్నేహితులను ఫూల్ చేయబోయి.. ఉరికి చిక్కుకుని యువకుడు మృతి

తిరువనంతపురం: ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు స్నేహితులను ఫూల్ చేయబోయిన ఓ యువకుడు ఉరికి చిక్కుకుని మరణించాడు. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఏప్రిల్ 1న ఈ ఘటన జరిగింది. తలావాడికి సమీపంలోని కిలిరూర్‌లో 17 ఏండ్ల సిద్దార్థ్ అజయ్ తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి భోజనం తర్వాత తన గదిలోకి వెళ్లాడు. చాలా సేపటి వరకు అతడు గది నుంచి రాకపోవడంతో తల్లి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఆ గదిలోని కిటికీ వద్ద అతడి మొబైల్ ఫోన్ లైవ్ స్ట్రీమ్‌లో ఉన్నది. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితులను ఫూల్ చేయబోయిన సిద్దార్థ్ మెడకు బెడ్‌షీట్ చిక్కుకోవడంతో మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

