24 ఏండ్ల తర్వాత లిఫ్ట్‌ను తెరిస్తే.. అస్థిపంజరం కనిపించింది

లక్నో: చాలా ఏండ్లుగా వినియోగించని లిఫ్ట్‌ను రిపేర్ కోసం తెరిస్తే అందులో ఒక మగ వ్యక్తి అస్థిపంజరం కనిపించింది. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లా కైలిలోని ఒపెక్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. 500 పడకల ఆసుపత్రిని 1991లో నిర్మించారు. ఆసుపత్రిలోని లిఫ్ట్ 1997 వరకు పనిచేసింది. అనంతరం రిపేర్ రావడంతో గత 24 ఏండ్లుగా దానిని వినియోగించడం లేదు.
ఈ నెల 1న రిపేర్ కోసం ఆసుపత్రిలోని లిఫ్ట్‌ను తెరిచారు. అయితే అందులో ఒక మగ వ్యక్తి అస్థిపంజరం ఉండటం చూసి షాకయ్యారు. అతడు లిఫ్ట్‌లో చిక్కుకొని ఊపిరాడక చనిపోయాడా లేదా ఎవరైనా హత్య చేసి అందులో దాచిపెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పోలీసులు, ఫోరెన్సిక్ విభాగం సిబ్బంది ఆ అస్థిపంజరాన్ని డీఎన్ఏ టెస్ట్ కోసం తరలించారు. ఈ మిస్టరీని ఛేదిస్తామని, 24 ఏండ్ల కిందట మిస్సైన వ్యక్తి సమాచారం గురించి సమీప పోలీస్ స్టేషన్లలో ఆరా తీస్తున్నట్లు బస్తీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

