విమానంలో దుస్తులు విప్పి.. అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి

న్యూఢిల్లీ: విమానంలో ఒక వ్యక్తి దుస్తులు విప్పి క్యాబిన్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఎయిర్ ఏషియాకు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 6న ఐ5-722 విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి ప్రయాణించింది. అందులోని ఒక ప్రయాణికుడు లైఫ్ జాకెట్ కోసం విమాన సిబ్బందితో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తన దుస్తులు విప్పి అర్థ నగ్నంగా మారాడు. ఆ వ్యక్తి అనుచిత ప్రవర్తనకు విమానంలోని మిగతా ప్రయాణికులు షాక్ అయ్యారు.
కాగా, పైలట్ ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం ల్యాండ్ కాగానే సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో అతడ్ని పోలీసులకు అప్పగించారు. విమానంలో దుస్తులు విప్పి అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఎయిర్ ఏషియా సంస్థ ఆ వ్యక్తిని నో ఫ్లై జాబితాలో చేర్చేందుకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

