ఇద్దరు యువతులను ఢీకొట్టిన పోలీస్ అధికారి కారు.. ఒకరు మృతి

చండీగఢ్: ఒక పోలీస్ అధికారి కారు ఇద్దరు యువతులను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరొకరు గాయపడ్డారు. పంజాబ్‌లోని జలంధర్‌లో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. జలంధర్ కంటోన్మెంట్ ప్రాంతంలో జలంధర్-ఫగ్వారా హైవేను దాటేందుకు ఇద్దరు యువతులు ప్రయత్నించారు. అయితే ఒక కారు వేగంగా వస్తుండటంతో వెనక్కివెళ్లారు. అంతలోనే ఆ కారు వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. కార్ షోరూమ్‌లో పని చేసే నవజోత్ కౌర్ మరణించగా తీవ్రంగా గాయపడిన మరో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.

ఇద్దరు మహిళలపైకి తెల్లని కారు దూసుకెళ్లిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఆ కారును పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ అమృత్ పాల్ సింగ్ డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించి ఆయనను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ప్రమాదం అనంతరం స్థానికులు పెద్ద సంఖ్యలో రహదారిపైకి చేరి నిరసన తెలిపారు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు బాగా అంతరాయం ఏర్పడింది.
విధులకు వెళ్తున్న తమ కుమార్తె మరణానికి కారణమైన పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ అమృత్ పాల్ సింగ్‌పై హత్య కేసు నమోదు చేయాలని నవజోత్ కౌర్ తల్లి డిమాండ్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

