దొరికిన మొబైల్లో.. ఫోన్‌పే ద్వారా రూ.52,000 లూఠీ

న్యూఢిల్లీ: దొరికిన మొబైల్లో ఫోన్‌పే ద్వారా రూ.52,000 లూఠీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. సందీప్ శర్మ అనే వ్యక్తి మొబైల్ ఫోన్ పోవడంతో ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 5న కొత్త మొబైల్ ఫోన్ కొన్న అతడు అందులో కొత్త సిమ్ వేశాడు. అనంతరం ఫోన్‌పే వాలెట్‌ను రీ యాక్టివేట్ చేశాడు.
అయితే గుర్తు తెలియని వ్యక్తి తన ఫోన్‌పే వాలెట్ నుంచి రూ.52,860 వాడినట్లు సందీప్ గుర్తించాడు. దీంతో బురారీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు, ఫోన్‌పే వాలెట్ నుంచి డబ్బులు పొందిన లబ్ధిదారుడి మొబైల్ నంబర్ ద్వారా అతడ్ని గుర్తించారు. అనంతరం ఈ నెల 6న సంజయ్, రాహుల్ దాస్ అనే ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
కాగా, సందీప్ శర్మ పోగొట్టుకున్న మొబైల్ దాస్‌కు దొరికిందని పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ టెక్నాలజీ తెలిసిన అతడు, సెక్యూరిటీ కోడ్లను రీసెట్ చేసినట్లు చెప్పారు. అనంతరం మొబైల్లోని ఫోన్‌పే యాప్ ద్వారా ఆరేడు లావాదేవీలు జరిపి పాన్ షాప్ యజమాని సంజయ్‌కు రూ.52,860 పంపినట్లు వివరించారు.
సంజయ్ కమీషన్‌గా కొంత తీసుకుని మిగతా డబ్బులు దాస్‌కు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దాస్ నుంచి బాధితుడి మొబైల్ ఫోన్‌తోపాటు, అతడు కొనుగోలు చేసి రూ.20,000 విలువైన కొత్త మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

