Playing poker | టాలీవుడ్ నటుడి ఫాంహౌజ్‌లో పేకాట.. 30 మంది అరెస్ట్

మణికొండ : నగర శివారులోని నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవులలోని ప్రముఖ సినీ హీరోకు చెందిన ఫాం హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పేకాట ఆడుతుండగా పలువురిని పోలీసులు పట్టుకున్నారు. టాలీవుడ్ హీరోకు చెందిన ఈ ఇంటిని లీజుకు తీసుకుని పేకాట క్లబ్‌ను నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
నగరానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ పేకాట స్థావరాన్ని గత రెండు రోజులుగా నిర్వ హిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు సుమన్‌కుమార్‌తో పాటు 29మందిపై కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అన్వేష్‌రెడ్డి తెలిపారు.
రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న మంచిరేవుల వద్ద హీరో నాగశౌర్యకు ఒక విల్లా ఉంది. సుమన్ అనే వ్యక్తి పుట్టినరోజు ఫంక్షన్ కోసం ఈ విల్లాను అద్దెకు తీసుకుని పేకాట స్థావరం గా మార్చినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో ప్రధాన నింధితుడు సుమన్ పరారయ్యాడు.
దాంతో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో లక్షల్లో నగదు, మొబైల్ ఫోన్లు, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నింధితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ విల్లాను నాగశౌర్య నుంచి ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

