కావలసిన పదార్థాలు
ఖర్జూరాలు: పది, యాపిల్: ఒకటి, పాలు: ఒక లీటర్, చక్కెర: ఒక కప్పు,
యాలకుల పొడి: పావు టీస్పూన్, డ్రైఫ్రూట్స్: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం
యాపిల్ పండును చిన్నచిన్న ముక్కలుగా కోయాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి అరకప్పు నీళ్లు పోసి యాపిల్ ముక్కలు, ఒక టీస్పూన్ చక్కెర వేసి పది నిమిషాలపాటు సన్నని మంటపై ఉడికించి పక్కనపెట్టాలి. గింజ తీసిన ఖర్జూరాలను మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్‌మీద మందపాటి గిన్నెపెట్టి పాలు, చక్కెర వేసి సన్నని మంటపై కలుపుతూ మరిగించాలి. పాలు చిక్కగా అయ్యాక ఖర్జూర పేస్ట్, యాలకుల పొడి వేసి మరికాసేపు ఉడికించాలి. చివరిగా ఉడికించిన యాపిల్ ముక్కలు, డ్రైఫ్రూట్స్ వేసుకుంటే నోరూరించే డేట్స్ యాపిల్ ఖీర్ సిద్ధం.