Balakrishna | అఖండ తర్వాత బాలకృష్ణ కెరీర్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు 30 కోట్లు ఉన్న మార్కెట్ కాస్త 70 కోట్లు అయింది. కరోనా సమయంలో కూడా 75 కోట్ల షేర్ వసూలు చేసి బాలకృష్ణ మాస్ స్టామినా ఏంటో చూపించింది అఖండ. ఇక మొన్న సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి కూడా నెగిటివ్ టాక్ వచ్చినా.. ఎదురుగా వాల్తేరు వీరయ్య లాంటి భారీ సినిమా ఉన్నా కూడా తట్టుకొని నిలబడి 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దాంతో ప్రస్తుతం బాలకృష్ణతో సినిమాలు చేయడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు.
ఇంకా చెప్పాలంటే బాలయ్య కోసం స్టార్ డైరెక్టర్స్ కథలు సిద్ధం చేస్తున్నారు. బాలయ్య కోసం వెయిట్ చేస్తున్నారు.
ఎఫ్ 3 విడుదలైన తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా.. దాదాపు ఆరు నెలల పాటు బాలకృష్ణ కోసం వెయిట్ చేశాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఆగస్టు చివర్లో బాలయ్య సినిమాకు గుమ్మడికాయ కొట్టబోతున్నాడు అనిల్. దీనికి భగవత్ లాల్ కేసరి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుంది. దీని తర్వాత బాలయ్య లైనప్ చూస్తే ఎవరికైనా బుర్ర గిర్రున తిరుగుతుంది. అనిల్ తర్వాత బోయపాటితో సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే ఈ కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సంచలన విజయాలు సాధించాయి. తాజాగా పొలిటికల్ థ్రిల్లర్ ఈ కాంబినేషన్ లో రానుంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించనున్నారు. దీని తర్వాత వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబి, బింబిసార దర్శకుడు వశిష్ట, ప్రశాంత్ వర్మలతో బాలయ్య కోసం క్యూలో ఉన్నారు.