Welcome To Jungle | ‘వెల్కమ్ టు ది జంగిల్’కు 18 కట్స్.. యూఏ సర్టిఫికేట్‌తో సెన్సార్ పూర్తి, రన్‌టైమ్‌పై కొత్త చర్చ
Welcome To Jungle | బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘వెల్కమ్ టు ది జంగిల్’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘వెల్కమ్’ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది.
Welcome To Jungle | బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘వెల్కమ్ టు ది జంగిల్’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘వెల్కమ్’ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది.అయితే సెన్సార్ క్లియరెన్స్‌కు ముందు చిత్రానికి పలు మార్పులు, కట్స్ సూచించబడినట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి మొత్తం 18 మార్పులను సూచించినట్లు తెలుస్తోంది. కొన్ని డైలాగ్‌లను సవరించడం, కొన్ని పదాలను మ్యూట్ చేయడం, కొన్ని ప్రస్తావనలను తొలగించడం వంటి మార్పులు చేసినట్లు సమాచారం.
సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్ర బృందం అవసరమైన మార్పులు చేసి సినిమాను ఫైనల్ చేసింది.సెన్సార్ ఎడిట్స్‌లో భాగంగా కొన్ని గ్లామరస్ విజువల్స్‌ను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్లు దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లకు సంబంధించిన కొన్ని బికినీ షాట్స్, క్లోజ్అప్ విజువల్స్‌ను ట్రిమ్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మద్యం సేవించడంకి సంబంధించిన సన్నివేశాల సమయంలో నిబంధనల ప్రకారం యాంటీ-ఆల్కహాల్ హెచ్చరికలను కూడా జోడించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 18 మార్పులు సూచించినప్పటికీ సినిమా నుంచి తొలగించిన మొత్తం నిడివి కేవలం 10 సెకన్లు మాత్రమేనని సమాచారం. చిన్నచిన్న సవరణలతోనే చిత్రానికి సెన్సార్ అనుమతి లభించింది.
సెన్సార్ అనంతరం ‘వెల్కమ్ టు ది జంగిల్’ ఫైనల్ రన్‌టైమ్ 165 నిమిషాలుగా, అంటే 2 గంటల 45 నిమిషాలుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది విడుదల కానున్న కమర్షియల్ ఎంటర్టైనర్లలో ఇది అత్యంత సుదీర్ఘ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. దీంతో సినిమా నిడివిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కామెడీ ఎంటర్టైనర్కు ఇంత పెద్ద రన్‌టైమ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, గతంలో ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మొదట సినిమా దాదాపు నాలుగు గంటల నిడివితో సిద్ధమైందని, తర్వాత దానిని గణనీయంగా తగ్గించామని ఆయన పేర్కొన్నారు.అయితే అప్పట్లో ఆయన 145 నిమిషాల రన్‌టైమ్ గురించి ప్రస్తావించగా, ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం 165 నిమిషాల నిడివి నమోదవడంతో అసలు రన్‌టైమ్ ఎంత అన్న సందేహం అభిమానుల్లో నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

