Bellamkonda Srinivas | పెళ్లి పీటలెక్కనున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మెగాస్టార్‌కు ఆహ్వానం!
Megastar Chiranjeevi | టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు.
Megastar Chiranjeevi | టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొంతకాలంగా ఆయన వివాహం గురించి ఫిలిం నగర్లో వినిపిస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ, తాజాగా పెళ్లి సందడి అధికారికంగా మొదలైంది. తన జీవితంలో ప్రారంభం కాబోతున్న ఈ కొత్త అధ్యాయం కోసం సాయి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగి సినీ పెద్దలను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా, ఆయన తన తండ్రి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ చిరంజీవికి పెళ్లి పత్రికను అందజేసి, వేడుకకు తప్పకుండా రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ సాయి శ్రీనివాస్‌ను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
చిరంజీవి నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు మరియు అభిమానులు #SreenivasaKavyanam అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను షేర్ చేస్తూ కొత్త జంటకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యేలా ఈ వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బెల్లంకొండ సురేష్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

