అంతుచిక్కని రహస్యాల ఛేదనలో..
దైవశక్తి చుట్టూ అల్లుకున్న అంతుచిక్కని రహస్యాలు, నిధి అన్వేషణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తన్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను డిసెంబర్ 4న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య గుబురు గడ్డంతో నుదుటిపై ఎర్రని తిలకాన్ని ధరించి సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. మార్మిక, ఆధ్యాత్మిక అంశాలు ప్రధానంగా నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ కథలో అంతుచిక్కని అనేక రహస్యాలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. హీరో నాగచైతన్య ట్రెజర్ హంటర్‌గా ధైర్యసాహసాలు మూర్తీభవించిన వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, స్పర్శ్శ్రీవాస్తవ, జయరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకత్వం: కార్తీక్ దండు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!