యామిని రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రెవ్రి ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సునీల్ నిమ్మల దర్శకుడు. ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ను ఇటీవల యువ కథానాయకుడు విశ్వక్సేన్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సరికొత్త కథతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాల వారిని మెప్పించే అంశాలున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ పట్నాయక్