టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. మరోవైపు వాసవ సుహాస, ఓ బంగారం పాటలను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్.
తాజాగా మూడో సాంగ్ న్యూస్ కూడా వచ్చింది. స్పెషల్ లుక్‌తో రిపబ్లిక్ కే విషెస్ తెలియజేస్తూ రేపు ఉదయం 10:05 గంటలకు మూడో పాట విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కిషోర్ అబ్బురూ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో కశ్మీర పరదేశి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మురళీ శర్మకీలక పాత్రలో నటిస్తున్నారు.
వినరో భాగ్యము విష్ణుకథ ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం మరోవైపు మీటర్, రూల్స్ రంజన్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
#VinaroBhagyamuVishnuKatha 3rd Single Update Tomorrow @ 10:05 AM✨
Wishing you all a very happy #HappyRepublicDay 🇮🇳#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @adityamusic pic.twitter.com/Pso4uKbDQy
— GA2 Pictures (@GA2Official) January 26, 2023
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..
వాసవ సుహాస సాంగ్ ప్రోమో..
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..