Vinaro Bhagyamu Vishnu Katha | మీరంతా చూడబోయేదే నా కథ.. వినరో భాగ్యము విష్ణుకథ టీజర్
ఇప్పటికే లాంఛ్ చేసిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోలకు మంచి స్పందన వస్తోంది. మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోలకు మంచి స్పందన వస్తోంది. మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. నా పేరు విష్ణు మా జీవితాలన్నీ ఏడుకొండల చుట్టూ తిరుగుతా ఉంటయి. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ.. అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే సంభాషలతో మొదలైంది టీజర్.
ఈ సినిమా కథేంటో అని రౌడీ గ్యాంగ్ అడుగుతుంటే.. కాన్సెప్ట్‌తో మొదలై.. లవ్వూ కామెడీ మిక్సయి.. రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చంటున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రంలో మురళీ శర్మ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందించేలా సాగనున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో మురళీ శర్మ సామజవరగమన పాటను ఇమిటేట్ చేయబోతున్నాడని టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.
మొత్తానికి టీజర్‌తోనే అందరి అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటున్నాడు డైరెక్టర్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల వైకుంఠపురంలో మూవీ లవర్స్ కు మా టీం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అంటూ కిరణ్ అబ్బవరం ఇప్పటికే షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఆ సర్ప్రైజ్ ఇదేనని టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది.
వినరో భాగ్యము విష్ణుకథ ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కశ్మీర పరదేశి హీరోయిన్గా నటిస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బురూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..
వాసవ సుహాస సాంగ్ ప్రోమో..
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

