విష్ణు తత్వాన్ని చెబుతూ
కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా నటిస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ దర్శకుడు.
కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా నటిస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ దర్శకుడు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ…‘విష్ణు తత్వాన్ని కమర్షియల్ కథలో చెప్పే చిత్రమిది.
నిత్యం సంతోషంగా ఉండాలని, సాటివాడికి సాయం చేయాలనే మంచి సందేశం ఉంది. ఇటీవల విడుదల చేసిన పాటకు మంచి స్పందన వస్తున్నది. మా సంస్థలో ప్రతిభ గల కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం సంతృప్తిగా ఉంది’ అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…‘నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ఇది. గీతా ఆర్ట్స్ సంస్థలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇదొక స్పెషల్ మూవీ. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, గీత రచయిత కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MDMA drugs | ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.. మరో నిందితుడు పరారీ
ENE Repeat Review | ‘ఈఎన్ఈ రిపీట్’ రివ్యూ: స్నేహం, సినిమా పిచ్చితో మరోసారి నవ్వించిన గ్యాంగ్!
NRI | దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుంది : నాగరాజు గుర్రాల
Bihar | బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి కాలువలో పడ్డ వాహనం, ఆరుగురు మృతి
IND vs NZ | సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసుకున్న హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్.. న్యూజిలాండ్140-5
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

