Vinaro Bhagyamu Vishnu Katha | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vinaro Bhagyamu Vishnu Katha Movie On OTT | హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్‌కు జోడీగా కశ్మీర పరదేశి హీరోయిన్గా నటించింది.
Vinaro Bhagyamu Vishnu Katha Movie On OTT | తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’తో అటు ఇటుగా మార్కులు వేయించుకున్న కిరణ్.. ‘ఎస్.ఆర్ కళ్యాణమండపం’తో వంద మార్కులు కొట్టేశాడు. రెండో సినిమాకే బ్లాక్‌బస్టర్ విజయం సాధించి యూత్‌లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మాత్రం వరుసగా మూడు ఫ్లాపులు. మధ్యలో ‘సమ్మతమే’ కాస్త బెటర్ అనిపించినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేదు. ఇక కిరణ పని అయిపోయంది అనుకున్న టైమ్‌లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు.
రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. పైగా గీతా సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనే అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. కలక్షన్లలో మాత్రం జోరు చూపించింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టేపనిలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. కాగా మార్చి 25నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఆహాలోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్‌కు జోడీగా కశ్మీర పరదేశి హీరోయిన్గా నటించింది. చైతన్య భరద్వాజ్ స్వరాలు సమకూర్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

