Vinaro Bhagyamu Vishnu Katha Movie On OTT | తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’తో అటు ఇటుగా మార్కులు వేయించుకున్న కిరణ్.. ‘ఎస్.ఆర్ కళ్యాణమండపం’తో వంద మార్కులు కొట్టేశాడు. రెండో సినిమాకే బ్లాక్‌బస్టర్ విజయం సాధించి యూత్‌లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మాత్రం వరుసగా మూడు ఫ్లాపులు. మధ్యలో ‘సమ్మతమే’ కాస్త బెటర్ అనిపించినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేదు. ఇక కిరణ పని అయిపోయంది అనుకున్న టైమ్‌లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలైంది.
రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. పైగా గీతా సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనే అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. కలక్షన్లలో మాత్రం జోరు చూపించింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టేపనిలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా ప్రకటించింది. ఉగాది పర్వదినాన ఈ సినిమాను మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ సినిమాలో కిరణ్‌కు జోడీగా కశ్మీర పరదేశి హీరోయిన్గా నటించింది. చైతన్య భరద్వాజ్ స్వరాలు సమకూర్చాడు.
చూడరో భాగ్యము ఈ చిత్ర కథ ఉగాదికి వస్తోంది ఆహాలో…🤩
అలా ఒక్కొక్క టేస్ట్ కి ఒక్కొక్క ట్విస్ట్ 😎#VinaroBhagyamuVishnuKatha Premieres from March 22nd on @ahavideoIN 💥#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @daniel_viswas @GA2Official pic.twitter.com/374MYtLpm0
— GA2 Pictures (@GA2Official) March 15, 2023