Beast Review : ‘బీస్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్
Beast Genuine Public Talk, Review and Rating. Thalapathy Vijay's #BeastPublicTalk It is an Indian Action Thriller Film. Written and Directed by Nelson Dilipkumar. Starring Vijay, Pooja Hegde, Selvaraghavan, Yogi Babu, Redin Kingsley, Bjorn Surrao and others. Produced by Sun Pictures banner. Music Composed by Anirudh Ravichander. Beast Telugu Movie Public Response.
నటీనటులు – విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్ల్సే తదితరులు
సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్ – నిర్మల్, సంగీతం – అనిరుధ్, నిర్మాత – కళానిధి మారన్, రచన, దర్శకత్వం – నెల్సన్
యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది విజయ్ బీస్ట్ సినిమా. విజయ్ స్టార్ డమ్, దర్శకుడు నెల్సన్ హిట్ ట్రాక్, సన్ పిక్చర్స్ భారీ నిర్మాణ విలువలు, మ్యూజిక్ హిట్ అవడం వంటివి సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఈ అంచనాలను బీస్ట్ అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం.

బీస్ట్ కథేంటంటే
భారత గూఢచార సంస్థ రా ఏజెంట్ వీర రాఘవ (విజయ్). తను చేసే సాహసోపేతమైన ఆపరేషన్స్ లో రాజకీయ జోక్యం అతనికి నచ్చదు. డిపార్ట్ మెంట్ అతన్ని హీరోలా చూస్తుంటారు. ఓ ఆపరేషన్ లో పై అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే ఓ పాప చనిపోవాల్సి వస్తుంది. ఆ పాప మృతికి తానే కారణం అనే పశ్చాతాపంతో ఉద్యోగం వదిలేస్తాడు వీర రాఘవ. ఈ ఘటనతో మానసికంగా ఇబ్బందిపడుతున్న అతన్ని డాక్టర్ (30 ఇయర్స్ పృథ్వీ) ఓ పెళ్లి వేడుకకు తీసుకెళ్తాడు. ఇక్కడ ప్రీతి (పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. ఇష్టంలేని పెళ్లి వద్దనుకుని వీర రాఘవను ప్రేమిస్తుంది. ఇంతలో ఓ మాల్ ను ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. వీళ్ల డిమాండ్స్ ఏంటి, ఉగ్రవాదుల నుంచి వందల మంది ప్రజల ప్రాణాలను వీర రాఘవ ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్
విజయ్ పర్మార్మెన్స్
పూజా హెగ్డే గ్లామర్
యాక్షన్ ఎపిసోడ్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
బలమైన కథ లేకపోవడం
సాగతీత సన్నివేశాలు
ఎలా ఉందంటే
విజయ్ హీరోయిజాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. సినిమా ప్రారంభం నుంచీ కథానాయకుడి కోణంలోనే సినిమా సాగుతుంది. అందుకు తగినట్లే విజయ్ ఓవరాల్ పర్మార్మెన్స్ చూపించాడు. పాటలో డాన్సులు, ఇతర క్యారెక్టర్లతో కలిసి కామెడీ, అదిరిపోయే యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. దర్శకుడిని నమ్మిన తర్వాత అతనెలా చెబితే అలా నటించడం అలవాటున్న విజయ్..నెల్సన్ ను పూర్తిగా నమ్మి ఫాలో అయ్యాడు. పూజా హెగ్డే తన పాత్రమేరకు నటించింది. ఉన్న సీన్స్ లో గ్లామర్ గా కనిపించింది. మిగతా చిత్రాలతో చూస్తే ఆమెకున్న స్పేస్ తక్కువే. కానీ కమర్షియల్ పాట్ బాయిలర్స్ లో హీరోయిన్స్ ప్లేస్ ఏంటో మనకు తెలిసిందే. యోగి బాబుతో వీలైనంత కామెడీ చేయించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సినిమా తొలి భాగంలో హీరో ఇంట్రోతో సహా పలు యాక్షన్ సీన్స్ తో వేగంగా కథ ముందుకెళ్తుంది. అరబిక్ కుతు పాటతో ఆడియెన్స్ లో హుషారు వచ్చేస్తుంది. కీర్తిని వీర కలిశాక కథను హ్యూమర్ దిశగా తీసుకెళ్లాడు దర్శకుడు. ఉగ్రవాదులో పోరు ప్రారంభం ఒకవైపు ఈ వినోదం మరోవైపు సమాంతరంగా సినిమాలో సాగుతాయి. యాక్షన్ హెవీ అనిపించినప్పుడు ప్రేక్షకులకు రిలీఫ్ ఇచ్చినవి ఈ కామెడీ సీన్సే. అల్తాఫ్ పాత్రలో దర్శకుడు సెల్వరాఘవన్ సీరియస్ పాత్రలోనూ నవ్వించాడు.

మొదటి భాగంలోనే హైలైట్స్ అన్నీ ఉండటంతో సెకండాఫ్ వీక్ అయ్యింది. మాల్ ను ఉగ్రవాదులు హైజాక్ చేయడం, హీరో హీరోయిన్లతో సహా ప్రధాన పాత్రలన్నీ అందులోనే ఇరుక్కోవడంతో సినిమా అంతా మాల్ దాటి బయటకు రాదు. దీంతో ప్రేక్షకులకు ఒకింత అసహనానికి గురవుతారు. అరబిక్ కుతు తప్ప మరో పాట లేకపోవడం మరో మైనస్ పాయింట్. కథలో ఆ స్పేస్ లేదనుకున్నాడో, క్రియేట్ చేయొద్దనుకున్నాడో గానీ పాటలు పెట్టలేదు. విజయ్ సినిమాలు మ్యూజికల్ హిట్స్ అవుతుంటాయి. ఇందులో లోపించింది అదే. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించింది. సూపర్ హిట్ పాట చేసి సినిమా మీద హైప్ పెంచిన సంగీత దర్శకుడు అనిరుధ్, నేపథ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. మిగతా సాంకేతిక వర్గం పనితీరూ బాగుంది.
చివరగా..ఎంటర్ టైనింగ్ బీస్ట్
రేటింగ్ – 2.5/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

