Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
Vijay Sethupathi | తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఆయన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినీ ప్రతిభకు ప్రతినిధిగా నిలవబోతున్నారు.
Vijay Sethupathi | తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఆయన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినీ ప్రతిభకు ప్రతినిధిగా నిలవబోతున్నారు. ప్రతిష్ఠాత్మక 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరించే అవకాశం విజయ్ సేతుపతికి దక్కింది. ఈ ఘనత సాధించనున్న తొలి భారతీయ నటుడిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గుర్తిస్తూ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డులను అందిస్తారు.
ఈ ఏడాది 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుక నవంబర్ 23, 2026న న్యూయార్క్‌లో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ వేడుకలో అవార్డులు అందించే ప్రెజెంటర్లలో విజయ్ సేతుపతి కూడా ఉండనున్నారు. భారతీయ నటుడికి ఇలాంటి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు దక్కడం సినీ పరిశ్రమకు గర్వకారణంగా మారింది. గతంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 2016లో జరిగిన 68వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల వేడుకలో హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్స్టన్తో కలిసి అవార్డును అందించారు. అయితే ప్రైమ్‌టైమ్ ఎమ్మీ, ఇంటర్నేషనల్ ఎమ్మీ రెండూ వేర్వేరు అవార్డుల వేడుకలు. ఇప్పుడు విజయ్ సేతుపతికి ఇంటర్నేషనల్ ఎమ్మీ వేదికపై ప్రెజెంటర్‌గా అవకాశం రావడం ప్రత్యేకతను సంతరించుకుంది.
అంతర్జాతీయ వేదికలపై భారతీయ కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించడంలో నిర్మాత, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో హాస్యనటుడు వీర్ దాస్‌ను ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుకకు వ్యాఖ్యాతగా తీసుకురావడంలోనూ ఆమె పాత్ర ఉంది. ఇప్పుడు విజయ్ సేతుపతికి ఈ అవకాశం దక్కడం భారతీయ వినోద రంగానికి మరో గుర్తింపుగా నిలవనుంది. విజయ్ సేతుపతి కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన ‘మహారాజా’ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. 2024లో విడుదలైన ఈ తమిళ థ్రిల్లర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా చైనాలోనూ ఈ సినిమాకు విశేష స్పందన లభించింది. కథలోని ఉత్కంఠ, ఊహించని మలుపులు, విజయ్ సేతుపతి నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయంతో ఇప్పుడు హాలీవుడ్‌లోనూ ఆసక్తి పెరిగింది. ‘మహారాజా’ కథను ఆంగ్లంలో రీమేక్ చేసేందుకు ఓ హాలీవుడ్ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే విజయ్ సేతుపతి నటనకు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
Kothagudem | ప్రేమించడమే ఆమె చేసిన నేరం.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్..?
Congress | నేను సీడబ్ల్యూసీ మెంబర్‌ను..! ఆఫ్ట్రాల్ టీపీసీసీ పిలిస్తే విచారణకు వస్తానా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

