Vijay – Rashmika | విజయ్–రష్మిక జోడీ మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్… రాజస్థాన్లోపెళ్లికి భారీగా ఏర్పాట్లు
Vijay - Rashmika | టాలీవుడ్లో యూత్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక జంట మరోసారి వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాయి.
Vijay – Rashmika | టాలీవుడ్లో యూత్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక జంట మరోసారి వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాయి. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ఈ జంటకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటికే రెండు విజయవంతమైన చిత్రాల్లో కనిపించిన ఈ జంట మూడోసారి కూడా కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘రణబాలి’ అనే టైటిల్‌ను ప్రకటించగా, విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. యాక్షన్, ఎమోషన్ మేళవింపుగా ఈ సినిమా ఉండబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే విజయ్, రష్మికల డేటింగ్‌పై చాలా కాలంగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. పబ్లిక్ ఈవెంట్స్‌లో కలిసి కనిపించడం, ఒకే తరహా బ్యాక్‌గ్రౌండ్స్‌తో ఫోటోలు షేర్ చేయడం వంటి విషయాలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. అయితే ఈ వార్తలపై ఇద్దరూ ఎప్పుడూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. తాజాగా వీరి పెళ్లిపై కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో వివాహ వేడుక జరుగుతుందన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నప్పటికీ, అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. సినీ వర్గాలు మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను పుకార్లుగానే చూడాలని సూచిస్తున్నాయి.
ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక జరగనుందని గాసిప్స్ వినిపిస్తుండగా, ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఏర్పాట్లకు సంబంధించి ఓ యువతి వీడియో షేర్ చేస్తూ విజయ్, రష్మిక పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పగా.. ఈ వీడియో నెట్టింట్ వైరల్‌గా మారింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ పరంగా ఇద్దరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే, వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలతో కూడా ఈ జంట ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తోంది. కొత్త సినిమా విడుదల సమయానికి ఈ రూమర్స్‌కు క్లారిటీ వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

