Viduthalai Movie | తెలుగులోనూ రిలీజ్ కాబోతున్న ‘విడుతలై-1’ మూవీ
Viduthalai Movie Telugu Release | తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్ని బ్లాక్‌బస్టర్ హిట్లే. కమర్షియల్‌గానే కాదు క్రిటిక్స్ నుంచి కూడా గొప్ప ప్రశంసలు అందుకున్నాయి.
Viduthalai Movie Telugu Release | తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్ని బ్లాక్‌బస్టర్ హిట్లే. కమర్షియల్‌గానే కాదు క్రిటిక్స్ నుంచి కూడా గొప్ప ప్రశంసలు అందుకున్నాయి. విసరనై, వడివసాల్, వడ చెన్నై, అసురన్ వంటి పలు అద్భుతమైన సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించి విడుతలై-1 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రముఖ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 31న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లో తమిళంలో మిలియన్ల వ్యూస్‌ను రాబట్టాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను తమిళంలో పాటు తెలుగులోనూ ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించిన ఈ సినిమాలో గౌతమ్ మీనన్ ప్రతినాయకుడిగా పాత్ర పోషిస్తున్నాడు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాను ఆర్ఎస్ ఇన్ఫోర్టైన్మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

