R Subbalakshmi | సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటి ఆర్.సుబ్బలక్ష్మి మృతి
R Subbalakshmi | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి (87 ) నవంబర్ 30న కొచ్చిలో కన్నుమూసింది. ఆమె వయసు 87 సంవత్సరాలు. అనారోగ్య సమస్యల కారణంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బలక్ష్మి గురువారం సాయంత్రం మృతి చెందినట్టు ఆమె మనవరాలు సౌభాగ్య తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.
R Subbalakshmi | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి (87 ) నవంబర్ 30న కొచ్చిలో కన్నుమూసింది. ఆమె వయసు 87 సంవత్సరాలు. అనారోగ్య సమస్యల కారణంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బలక్ష్మి గురువారం సాయంత్రం మృతి చెందినట్టు ఆమె మనవరాలు సౌభాగ్య తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. ఇక సుబ్బలక్ష్మి మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పించారు.
తెలుగు, తమిళ, మలయాళంతో పాటు బాలీవుడ్లో దాదాపు 75 సినిమాలలో సుబ్బలక్ష్మి నటించారు. ఇక ఆమె చివరిసారిగా దళపతి విజయ్ హీరోగా నటించిన ‘బీస్ట్’ సినిమాలో కనిపించారు. మలయాళ చిత్రసీమలో చేసిన అమ్మమ్మ పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. తెలుగులోనూ ఆమె కల్యాణ రాముడు, ఏ మాయ చేశావే సినిమాల్లో కనిపించింది.
వృత్తిపరంగా సంగీత విద్వాంసురాలు, నృత్య కళాకారిణి అయిన సుబ్బలక్ష్మి చిన్నతనం నుంచే కళలలో చురుకుగా ఉండేవారు. ఇక 1951లో ఆల్ ఇండియా రేడియో ద్వారా కళాత్మక జీవితాన్ని ప్రారంభించారు. ఇక రేడియోలో దక్షిణాది నుంచి వచ్చిన తొలి మహిళా కంపోజర్‌గా రికార్డులకెక్కారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ సుబ్బలక్ష్మి పనిచేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

