Venkatramaiah Gari Taluka | మూవీ రివ్యూ: మనసులను కదిలించే ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. తండ్రి త్యాగాల భావోద్వేగ కావ్యం!
Venkatramaiah Gari Taluka | ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా పరిచయమవుతూ, కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన సరికొత్త చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'.
Venkatramaiah Gari Taluka | ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా పరిచయమవుతూ, కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన సరికొత్త చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. దినేష్ కుమార్, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. సతీష్ ఆవాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందే టీజర్, పాటలతో అంచనాలు పెంచిన ఈ సినిమా, నేటి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం…
కథ
పిల్లలే ప్రాణంగా బతికే ఒక మధ్యతరగతి తండ్రి వెంకట్రామయ్య (మురళీధర్ గౌడ్). ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. పిల్లల సంతోషం కోసం వారి ప్రేమ పెళ్లిళ్లను సైతం అంగీకరించి, తన ఆస్తులను త్యాగం చేస్తాడు. అయితే, కాలంతో పాటు మారిపోయిన మనుషుల ప్రవర్తన వల్ల వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులు ఎలాంటి వేదనను అనుభవించారు? నేటి సమాజంలో కనుమరుగవుతున్న కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను ఒక తండ్రి ఆత్మగౌరవ పోరాటం ద్వారా దర్శకుడు ఈ చిత్రంలో హృద్యంగా ఆవిష్కరించారు.
నటీనటుల విశ్లేషణ
మురళీధర్ గౌడ్: ఈ సినిమాకు ప్రధాన బలం మురళీధర్ గౌడ్ నటన. బాధ్యతగల మధ్యతరగతి తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఆయన పలికించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. హీరోగా తొలి చిత్రమే అయినప్పటికీ దినేష్ కుమార్ ఎంతో పరిణతితో నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో మంచి నటనను కనబరిచి, భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించారు. హీరోయిన్గా ఈటీవీ ప్రభాకర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన దివిజ.. అమాయకత్వం, భావోద్వేగాలు కలబోసిన పాత్రలో ఎంతో సహజంగా నటించి మెప్పించారు. తల్లి పాత్రలో సీనియర్ నటి సుధా తన అనుభవాన్ని మరోసారి చాటుకున్నారు. కాశీ విశ్వనాథ్, సెల్వరాజ్, మిర్చి మాధవి, జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
దర్శకత్వ ప్రతిభ – విశ్లేషణ
ఇటీవల కాలంలో యాక్షన్, థ్రిల్లర్ సినిమాల జోరు పెరిగిన నేపథ్యంలో, దర్శకుడు సతీష్ ఆవాల పూర్తి స్థాయి కుటుంబ విలువలతో కూడిన కథను ఎంచుకోవడం అభినందనీయం. కమర్షియల్ హంగులు, బలవంతపు కామెడీ, అసభ్యతకు తావు లేకుండా, మధ్యతరగతి ఇళ్లలో జరిగే యదార్థ పరిస్థితులను కళ్లకు కట్టారు. సినిమా మొదటి భాగం పాత్రల పరిచయం, గ్రామీణ వాతావరణంతో సాగగా.. ద్వితీయార్థంలో వచ్చే తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ సీన్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. నిడివి కాస్త తగ్గించి ఉంటే కథ మరింత వేగంగా సాగేది, అయినప్పటికీ భావోద్వేగాలను పండించడంలో దర్శకుడు విజయం సాధించారు.
సాంకేతిక విభాగం
సంగీతం: చరణ్ అర్జున్ అందించిన ఆరు పాటలు వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం (BGM) ఎమోషనల్ సీన్స్‌ను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ గ్రామీణ ప్రాంతాల అందాలను, పల్లెటూరి సహజత్వాన్ని కెమెరామెన్ చాలా చక్కగా క్యాప్చర్ చేశారు. నిర్మాత కోమలి తన నిజ జీవిత అనుభవాల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి గాయనిగా, ఇప్పుడు నిర్మాతగా మారిన ఆమె.. ఎక్కడా రాజీ పడకుండా కథకు తగినట్లుగా ఉన్నతమైన నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించారు.
తీర్పు
తల్లిదండ్రులు పిల్లల కోసం సర్వస్వం త్యాగం చేస్తే.. వృద్ధాప్యంలో వారు పిల్లలకు ఎందుకు భారమవుతున్నారు?” అనే ఆలోచనాత్మకమైన ప్రశ్నను ఈ సినిమా లేవనెత్తింది. భారీ హంగులు ఆశించకుండా, మనసుకు హత్తుకునే ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని చూడాలనుకునే వారు ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ చిత్రాన్ని థియేటర్లలో తప్పక చూడవచ్చు. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
రేటింగ్: 3 / 5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

