ఆత్మతో కనకరాజు అవస్థలు
మెగా హీరో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నది.
మెగా హీరో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నది. ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఇప్పటికే ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.
అగ్ర కథానాయకుడు ప్రభాస్ ఈ టీజర్‌ని ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. రాయలసీమలోని పెనుగొండ ప్రాంతాన్ని పరిచయం చేస్తూ కనకరాజు వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. సరదాగా సాగే కనకరాజు జీవితం, ఓ కొరియన్ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఎలా మారింది? అనేది ఈ టీజర్లో ఆసక్తికరంగా సాగింది. ఆత్మలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో కామెడీ, యాక్షన్, ఫాంటసీ హారర్ అంశాలతో ఈ కథ సాగుతుందని టీజర్ చెబుతున్నది. రాయలసీమ గ్రామీణ నేపథ్యాన్ని, కొరియా వాతావరణాన్ని మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయిక. సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. కెమెరా: మనోజ్ రెడ్డి, సంగీతం: తమన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

