Bellamkonda Sreenivas | మెగా ప్రిన్స్ అనుకుంటే బెల్లంకొండ శ్రీను లైన్లోకి వచ్చాడు?
Sagar K Chandra | అదేంటో ఒక్కోసారి ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరికి వెళ్లి లాక్ అవుతుంది. రేపో మాపో అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది అనుకున్న టైమ్ లో హీరోనే మారిపోతాడు. గురువారం ప్రకటించిన బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా పరిస్థితి ఇదే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథ ముందుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో అనుకున్న కథని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Sagar K Chandra | అదేంటో ఒక్కోసారి ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరికి వెళ్లి లాక్ అవుతుంది. రేపో మాపో అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది అనుకున్న టైమ్ లో హీరోనే మారిపోతాడు. గురువారం ప్రకటించిన బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా పరిస్థితి ఇదే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథ ముందుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో అనుకున్న కథని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాగర్ చంద్ర భీమ్లానాయక్ కంటే ముందే వరుణ్ తేజ్ తో 14రీల్స్ బ్యానర్ లో ఓ సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. మూడు, నాలుగు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు. అయితే పలు కారణాల వల్ల ఆ ప్రాజక్ట్ హోల్ట్ లో పెట్టి పవన్ తో భీమ్లా నాయక్ చేశాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ తోనే సినిమా అనుకుంటే.. అనూహ్యంగా బెల్లంకొండ లైన్ లోకి వచ్చాడు.
కాగా ఈ కథ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో చేయాలనుకున్న కథే అని సమాచారం. అప్పుడు లాక్ చేసుకున్న 14 రీల్స్ లోనే ఈ సినిమా చేస్తుండటంతో కన్ఫార్మ్ గా అదే కథ అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ‘అల్లుడు శ్రీను’తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు శ్రీనివాస్. ఈ క్రమంలో తన లక్కును హిందీలో పరిక్షించుకోవాలని ‘ఛత్రపతి’ రీమేక్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిరోజు నుంచి ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకొని ఘోర పరాజయం మూటగట్టుకుంది. పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయిందంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఏ స్థాయిలో తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ ‘భీమ్లానాయక్’ దర్శకుడు సాగర్ కే చంద్రతో తన కొత్త సినిమాను ప్రకటించాడు. 14రీల్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

