Varanasi | ‘వారణాసి’ ఓటీటీ డీల్‌పై అసంతృప్తి .. భారీ ధర కోసం రాజమౌళి టీమ్ ఎదురుచూపులు!
Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో నిర్మాతలు విడుదలకు ముందే వ్యాపార లావాదేవీలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించి వినిపిస్తున్న తాజా వార్త ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వారణాసి’ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కుల కోసం వచ్చిన ఆఫర్ నిర్మాతలు ఆశించిన స్థాయిలో లేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం డిజిటల్ హక్కుల విషయంలోనే కాకుండా, ఇతర థియేటరేతర హక్కుల ఒప్పందాల విషయంలోనూ చిత్ర బృందం ఆశించిన ధరలు లభించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఒప్పందాలకు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే మేకర్స్ స్పందన కోసం వేచి చూడాల్సిందే.
రాజమౌళి సినిమా అంటేనే భారీ స్థాయి నిర్మాణం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చిత్రీకరణ గుర్తుకొస్తాయి. ‘వారణాసి’ కూడా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కావడంతో, దీని వ్యాపారంపై ట్రేడ్ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇలాంటి భారీ చిత్రాలకు ఓటీటీ, ఉపగ్రహ ప్రసార, ఇతర హక్కుల ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా ఉంటుంది. అయితే నిర్మాణ వ్యయం, సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగా సరైన ధర లభించినప్పుడే ఒప్పందాలను ఖరారు చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తొందరపడకుండా, మార్కెట్ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. మహేశ్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | ‘వారణాసి’ ఓటీటీ డీల్‌పై అసంతృప్తి .. భారీ ధర కోసం రాజమౌళి టీమ్ ఎదురుచూపులు!
Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం..!
Neeraj Yadav: ఏషియన్ పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య
Ranabaali | ‘రణబాలి’ నుంచి మనసును హత్తుకునే ‘కారు నిసలే’ వీడియో సాంగ్ విడుదల!
Nani and Anjana | ‘బ్లాక్‌బస్టర్’ సంసారానికి 14 ఏళ్లు.. నాని-అంజు జంటకు అభిమానుల శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

