సునీల్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘వాలెంటైన్స్ నైట్’. ఈ చిత్రాన్ని స్వాన్ మూవీస్ సమర్పణలో ఫన్ సాగ బ్యానర్‌పై తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి మహీంధర్ నారల నిర్మిస్తున్నారు. అనిల్ గోపిరెడ్డి దర్శకుడు. నేడు ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. తాజాగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైతన్య రావు మాట్లాడుతూ…‘ఈ సినిమాలో పది కథలుంటాయి. ప్రతి కథ మరొకదానితో ముడిపడి ఉంటాయి. అనేక జానర్స్ కలిసి ఉండటం ఈ చిత్ర ప్రత్యేకత. సకుటుంబంగా చూడాల్సిన చిత్రమిది’ అన్నారు.
దర్శకుడు అనిల్ గోపిరెడ్డి మాట్లాడుతూ…‘ఆరు జంటల మధ్య సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఒకరి కథలోకి మరొకరు వచ్చాక ప్రేమికుల దినోత్సవం రోజు ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమ, రొమాన్స్, టీనేజ్ లైఫ్ వంటి అంశాలతో ఆకట్టుకుంటుంది’ అన్నారు.