Ustaad Bhagat Singh | బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. హాలిడే సమయంలోను పుంజుకోని కలెక్షన్స్!
Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య ఉగాది కానుకగా విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలకు సరిపడే స్థాయిలో వసూళ్లు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.
Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య ఉగాది కానుకగా విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలకు సరిపడే స్థాయిలో వసూళ్లు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మంచి ఓపెనింగ్ అందుకుంది. అయితే రెండో రోజుకే కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. రెండో రోజు కేవలం రూ.11–12 కోట్ల మధ్యే వసూళ్లు రావడం గమనార్హం. వర్కింగ్ డే కావడంతో ఈ డ్రాప్ సహజమేనని అభిమానులు భావించారు.
మూడో రోజు రంజాన్ హాలిడే ఉండటంతో కలెక్షన్స్ పెరుగుతాయని ఎగ్జిబిటర్లు, ట్రేడ్ విశ్లేషకులు ఆశించారు. కానీ ఆశ్చర్యకరంగా మూడో రోజు కూడా సినిమా పెద్దగా పుంజుకోలేకపోయింది. శనివారం రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.11 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టడం నిరాశ కలిగించే విషయం. మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా రూ.73 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుండగా, కొన్ని నివేదికలు మాత్రం రూ.63 కోట్ల పరిధిలోనే కలెక్షన్స్ ఉన్నట్లు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కొంతవరకు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం సినిమా బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్క్ కూడా చేరుకోలేదని సమాచారం.
సుమారు $800K వరకు మాత్రమే కలెక్షన్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం ఓవర్సీస్లో ఇది భారీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు రూ.200 కోట్ల గ్రాస్‌గా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్‌ను బట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కనీసం ఆదివారం కలెక్షన్స్ ఎలా ఉంటాయోననే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందా లేదా అన్నది కూడా అదే రోజుతో క్లియర్ అవుతుందని చెబుతున్నారు. ఇక పోటీ విషయానికి వస్తే, అదే సమయంలో విడుదలైన ‘ధురంధర్ 2’ సినిమా మంచి వసూళ్లు రాబడుతూ ఉండటం కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ప్రభావం చూపుతున్నదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా కంటే ‘ధురంధర్ 2’కి మెరుగైన స్పందన రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

