Toxic | ‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌పై సస్పెన్స్.. యశ్ ఫ్యాన్స్ ఎదురుచూపులు!
Toxic | రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత యశ్ వెండితెరపై కనిపించబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది.
Toxic | రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత యశ్ వెండితెరపై కనిపించబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. అయితే సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాకపోవడం అభిమానుల్లో ఆసక్తితో పాటు కొంత ఆందోళనను కూడా కలిగిస్తోంది.
‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ బుకింగ్స్ నిన్న ప్రారంభమవుతాయని డిస్ట్రిబ్యూటర్ ప్రకటించినప్పటికీ, అనుకున్న సమయానికి టికెట్ విక్రయాలు ప్రారంభం కాలేదు. దీంతో యశ్ అభిమానులు సోషల్ మీడియాలో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభానికి సంబంధించిన కచ్చితమైన సమయంపై స్పష్టత లేకపోయినప్పటికీ, ఈరోజే ప్రధాన టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘KGF’ సిరీస్ తర్వాత యశ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. యశ్ చాలా కాలం తర్వాత థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది.తెలుగు రాష్ట్రాల్లో కూడా యశ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ‘KGF: Chapter 1’, ‘KGF: Chapter 2’ సినిమాల తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. దీంతో బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే టికెట్లకు భారీ డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యశ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, స్టార్ హీరోయిన్లు కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు సుదేవ్ నాయర్ తదితరులు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bookings
- geetu mohandas
- kgf
- look
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

