TovinoThomas | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో టోవినో థామస్.. వార్తలపై క్లారిటీ ఇచ్చిన మలయాళ స్టార్!
NTRNeel | యంగ్ టైగర్ ఎన్టీఆర్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ (#NTRNeel) గురించి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
TovinoThomas | యంగ్ టైగర్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ (#NTRNeel) గురించి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరో సినిమా చేస్తుండటం అందులో టోవినో థామస్ నటిస్తున్నారనే వార్తలు రావడంతో ఈ ప్రాజెక్ట్ స్థాయి పాన్-ఇండియాలో మరింత పెరిగింది.
అయితే తాజాగా గోవాలో జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికపై టోవినో థామస్‌కు ఈ విషయంపై మీడియా నుండి ప్రశ్న ఎదురైంది. #NTRNeel ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారా అని అడగ్గా, టోవినో థామస్ తెలివిగా స్పందిస్తూ, “ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడే స్థితిలో లేను” అని బదులిచ్చారు. సాధారణంగా ఒక వార్త అవాస్తవమైతే నటులు వెంటనే ఖండిస్తారు. కానీ టోవినో థామస్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా దాటవేయడంతో ఈ చిత్రంలో ఉన్నాడని తెలుస్తుంది. దీని గురించి అధికారికంగా ప్రకటించే సమయం కోసం వేచి చూస్తున్నారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టోవినో వంటి పాన్-ఇండియా నటుడి రాక ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్‌ను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

