Tollywood Small Films | రేసు నుంచి తప్పుకుంటున్న చిన్న సినిమాలు..!
సమ్మర్ సీజన్ కావడంతో ఆర్ఆర్ఆర్తోపాటు రాధేశ్యామ్, కేజీఎఫ్ చాఫ్టర్, ఆచార్య, సర్కారు వారి పాట, బీస్ట్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ డేట్స్ ను ఫైనల్ చేశాయి. ఆ తర్వాత చిన్న సినిమాలు (Small Films) హవా తగ్గిపోయిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood)లో చిన్న సినిమాలు (Small Films) హవా తగ్గిపోయిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎందుకంటే కోవిడ్ థర్డ్ వేవ్ ధాటికి పెద్ద సినిమాలే విడుదల వాయిదా వేసుకుంటూ వచ్చాయి. సమ్మర్ సీజన్ కావడంతో ఆర్ఆర్ఆర్తోపాటు రాధేశ్యామ్, కేజీఎఫ్ చాఫ్టర్, ఆచార్య, సర్కారు వారి పాట, బీస్ట్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ డేట్స్ ను ఫైనల్ చేశాయి. దీంతో మాధ్యమిక, చిన్న సినిమాల విడుదల విషయంలో సాహసం చేయలేక వెనక్కి తగ్గాయి.
కొంత సాహసం చేసి రిలీజ్ చేసుకున్న స్టాండప్ రాహుల్ (Standup Rahul), మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible), గని చిత్రాలకు బాక్సాపీస్ వద్ద ఆశించినంతగా ఆదరణ కరువైపోయింది. వీటిలో ఆచార్య, సర్కారు వారి పాట మినహా మిగిలిన పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. కేజీఎఫ్ 2 (KGF2) ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతుంది. చిన్న సినిమాల్లో నాగశౌర్య (Naga Sourya) హీరోగా నటించిన కృష్ణా వృందా విహారి, విశ్వక్ సేన్ (Viswaksen) నటించిన అశోక వనంలో అర్జుణ కల్యాణం ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
కేజీఎఫ్ 2 లాంటి పెద్ద సినిమాకు ముందు కేవలం ఈ రెండు సినిమాలకు వారం గ్యాప్ మాత్రమే ఉంది. అయితే ఇది చాలా తక్కువ గ్యాప్ అని..తమ సినిమాలు మనుగడ సాధించడం కష్టమేనని ఈ రెండు సినిమాల నిర్మాతలు భావిస్తున్నారట. ప్రేక్షకులు కూడా ప్రస్తుతం బిగ్ మాస్ ఎంటర్టైనర్స్ నే చూసేందుకు రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది.
ఖచ్చితంగా విజయ్ నటించిన బీస్ట్, యశ్ నటించిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 చిత్రాల హ్యాంగోవర్ ప్రభావం దాదాపు 2-3 వారాలుంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాగశౌర్య, విశ్వక్ సేన్ సినిమాలు ఎలా గడ్డకు పడతాయోననే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

