Thudarum | రూ.160 కోట్ల క్లబ్లో మోహన్ లాల్ ‘తుడరుమ్’.. ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్లు
Thudarum Movie | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం 'తుడరుమ్' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.
Thudarum Movie | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘తుడరుమ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన మొదటిరోజు నుంచే హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కేవలం ఇండియాలోనే రూ. 75 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా మలయాళ భాషలో విడుదలైన వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.
మార్చి 27న ఎంపురాన్ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న మోహన్ లాల్ ఈ సినిమా తర్వాత నెల రోజులు కూడా గ్యాప్ తీసుకోకుండానే తుడరుమ్ని విడుదల చేశాడు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రావడంతో జనాలు థియేటర్లకి క్యూ కడుతున్నారు. దీంతో ఎల్2 ఎంపురాన్ తర్వాత తుడరుమ్ చిత్రం మోహన్‌లాల్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు.
‘తుడరుమ్’ చిత్రానికి థరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో మోహన్‌లాల్ సరసన శోభన నటించింది. ప్రకాష్ వర్మ, బిను పప్పు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

