Papam Prathap Teaser | ప్రతాప్ చేసిన పాపం ఏంటి? ఆకట్టుకుంటున్న తిరువీర్ కొత్త సినిమా టీజర్
Papam Prathap | 'మసూద', 'పరేషాన్' 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్' వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పాపం ప్రతాప్’.
Papam Prathap | ‘మసూద’, ‘పరేషాన్’ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పాపం ప్రతాప్’. ఏ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఒక సామాన్యమైన వ్యక్తి జీవితంలో ఎదురయ్యే వింతైన, వినోదాత్మకమైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టైటిల్‌కు తగ్గట్టే హీరో ‘ప్రతాప్’ పడే కష్టాలు, చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకునే తిరువీర్, ఈ సినిమాలో కూడా తనదైన మేనరిజమ్స్‌తో మరోసారి మెప్పించనున్నాడు. టీజర్లో చూపించిన విజువల్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేశాయి. కేవలం వినోదం మాత్రమే కాకుండా, కథలో ఏదో బలమైన పాయింట్ ఉందనే సంకేతాన్ని టీజర్ ఇస్తోంది. ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎస్.పీ దుర్గ నరేష్ దర్శకత్వం వహిస్తుండగా.. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాధకృష్ణ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
Ee Papam ki backstory untundi… 😉🔥
Papam Prathap Teaser out now 🎥#PapamPrathap
A Win Original Production
In theatres from April 17th ✨@iamthiruveeR @rakeshreddy1224 @krishna_kri @ThisisNitin1111 @payal_radhu @arvindmule_pd @vishutheone @GuruKiran87 @Saikishore040 pic.twitter.com/nuOI3bi20z— ETV Win (@etvwin) March 25, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

