Thiruveer | కన్నవారికి కర్మలు చేయలేకపోయా … పాపం ప్రతాప్ హీరో ఎమోషనల్ కామెంట్స్ వైరల్
Thiruveer |టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తాజాగా ‘పాపం ప్రతాప్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన సహజమైన నటనతో తిరువీర్ మరోసారి ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నాడు.
Thiruveer |టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తాజాగా ‘పాపం ప్రతాప్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన సహజమైన నటనతో తిరువీర్ మరోసారి ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నాడు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తిరువీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక బాధాకర విషయాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. సినిమా షూటింగ్ షెడ్యూల్స్, లుక్ కంటిన్యూటీ సమస్యల కారణంగా తన తల్లిదండ్రుల అంత్యక్రియలు, అనంతర కర్మకాండలను సరిగ్గా నిర్వహించలేకపోయానని తిరువీర్ భావోద్వేగంతో చెప్పారు.
షూటింగ్ మధ్యలో జుట్టు కత్తిరించడం లేదా లుక్ మార్చడం సాధ్యం కాకపోవడంతో, వృత్తిపరమైన బాధ్యతల కోసం వ్యక్తిగతంగా పెద్ద త్యాగం చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నానని ఆయన వెల్లడించారు. ఒక్కడే కొడుకువై ఉండి కనీసం ఈ మాత్రం కూడా చేయలేవా? అని అడిగిన సందర్భాలు తనను మరింత బాధించాయని తెలిపారు. వృత్తి పట్ల ఉన్న అంకితభావం తనను వ్యక్తిగతంగా ఎంతగా కలిచివేసిందో చెబుతూ, ఆ గిల్ట్ జీవితాంతం తనను వెంటాడుతుందని తిరువీర్ పేర్కొన్నారు. బయటకు నటుడిగా నవ్వుతూ కనిపించినా, లోపల ఎన్నో బాధలు, త్యాగాలు ఉంటాయని ఆయన మాటలు స్పష్టం చేశాయి.
‘పాపం ప్రతాప్’ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ, తన కష్టానికి తగిన గుర్తింపు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం తిరువీర్ చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పలువురిని కదిలిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో షాక్.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్!
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
Rajinikanth | రూ.600 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. 40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
Water Wastage | నీళ్లు వృథా చేసే ట్యాంకర్లకు 5 వేలు జరిమానా.. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు.. జలమండలి ఎండీ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

