ఇందువదన రహస్యం

వరుణ్‌సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇందువదన’. ఎమ్ఎస్ఆర్ దర్శకుడు. శ్రీబాలాజీ పిక్చర్స్ పతాకంపై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. సినిమా చిత్రీకరణ పూర్తయింందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అటవీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. థ్రిల్లర్, సస్పెన్స్ అంశాలతో సాగుతుంది. ఇందువదన తాలూకు రహస్యమేమిటన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. చాలా విరామం తర్వాత వరుణ్‌సందేశ్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్, క్యారెక్టర్ ఇంట్రోలుక్స్ కళాత్మకంగా ఉన్నాయని ప్రశంసలొస్తున్నాయి’ అన్నారు. తన కెరీర్లో విభిన్న ప్రేమకథ ఇదని వరుణ్‌సందేశ్ తెలిపారు. రఘుబాబు, అలీ, నాగినీడు, సురేఖవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.మురళికృష్ణ, సంగీతం: శివ కాకాని, కథ, మాటలు: సతీష్ ఆకేటి, దర్శకుడు: ఎంఎస్ఆర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

