ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘కంచర్ల’. మీనాక్షి జైస్వాల్, ప్రణీత నాయికలుగా నటిస్తున్నారు. బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కె. అచ్యుతరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రెడ్డెం యాదకుమార్ దర్శకుడు.
ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు యాదకుమార్ మాట్లాడుతూ..‘యువకులు రాజకీయాల్లోకి రావాలని, సేవా దృక్పథంతో పనిచేయాలనే సందేశాన్నిచ్చే చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందిస్తున్నాం. విశాఖలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’అన్నారు.