Slumdog Husband | దోషం ఉందని ఓ అబ్బాయి కుక్కను పెండ్లి చేసుకుంటే ఏమవుతుంది? ప్రతి సీన్ నవ్వు తెప్పిస్తుంది
Slumdog Husband | “స్లమ్ డాగ్ హజ్బెండ్' కథను దర్శకుడు చెబుతూనే తెగ నవ్వుకున్నారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’ అన్నారు కథానాయకుడు సంజయ్ రావు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడిగా అందరికి సుపరిచితుడైన సంజయ్ రావు నటిస్తున్న తాజా చిత్రం.
Slumdog Husband | “స్లమ్ డాగ్ హజ్బెండ్’ కథను దర్శకుడు చెబుతూనే తెగ నవ్వుకున్నారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’ అన్నారు కథానాయకుడు సంజయ్ రావు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడిగా అందరికి సుపరిచితుడైన సంజయ్ రావు నటిస్తున్న తాజా చిత్రం. ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో అప్పిరెడ్డి, అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సంజయ్రావు మీడియాతో ముచ్చటించారు.
ఆయన మాట్లాడుతూ ‘ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడికి జాతకంలో దోషం వుండటం వల్ల దాని పరిహారం కోసం కుక్కని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత ఆ యువకుడికి ఎదురైన పరిణామాలేంటి అనేది ఈ చిత్ర కథ. ప్రతి సన్నివేశం ఎంతో వినోదాత్మకంగా వుంటుంది. ఈ సినిమాలో బేబీ (కుక్క)దే కీరోల్. అదే సినిమాను మొత్తం డిసైడ్ చేస్తుంది. ఈ చిత్రంలో చాలా మంది డబుల్ మీనింగ్ డైలాగ్స్ వుంటాయని అనుకుంటున్నారు. అలాంటివేమి వుండవు. జనరల్‌గా రాత్రి పూట బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మాట్లాడుకునేదే వుంటుంది. అదే రియాలిటీ వుంటుంది. ఈ రియాలిటీకి యంగ్ జనరేషన్ కనెక్ట్ అవుతుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

