Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం (Thalapathy 69) విడుదల తేదీ ఎట్టకేలకు అధికారికంగా ఖరారైంది. ఎన్నో వాయిదాలు, సెన్సార్ వివాదాల తర్వాత ఈ చిత్రానికి ‘జననాయగన్’ (తెలుగులో ‘జననాయకుడు’, హిందీలో ‘జన్ నేత’) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ (CBFC) ఇప్పటికే ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో జులై 23న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Tested by fire.
Forged by time.
Built for history.
The tougher the battle,
The louder the victory.#JanaNayaganFromJuly23#JanaNayakuduFromJuly23#JanNetaFromJuly23The Hon’ble Chief Minister @actorvijay @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol… pic.twitter.com/21xjixgUBM
— KVN Productions (@KvnProductions) July 15, 2026