సినీ జర్నలిస్ట్, నిర్మాత బీఏ రాజు కన్నుమూత

ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు (61) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు చిత్రసీమతో నాలుగు దశాబ్దాల అనుబంధం కలిగిన ఆయన వెయ్యికిపైగా చిత్రాలకు పీఆర్వోగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సతీమణి, దర్శకురాలు జయ.బి రెండు సంవత్సరాల క్రితం మరణించారు. ఆమె దర్శకత్వం వహించిన ప్రేమలో పావని కల్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలకు బీఏ రాజు నిర్మాతగా వ్యవహరించారు. సీనియర్ హీరో కృష్ణ అభిమానిగా పరిశ్రమలో అడుగుపెట్టిన బీఏ రాజు తొలుత ఆయన పబ్లిసిటీ వ్యవహరాల్ని చూసుకునేవారు. కృష్ణ ప్రోత్సాహంతో సినిమా జర్నలిస్ట్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. అనంతరం 1994లో సతీమణి జయతో కలిసి ‘సూపర్‌హిట్’ సినీ వారపత్రికను ప్రారంభించారు.
సినీ పాత్రికేయుడిగా కొనసాగుతూనే పరిశ్రమలోని పలువురు అగ్రహీరోలు, దర్శకులు, కథానాయికలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు పీఆర్వోగా పనిచేశారు. సినీ పబ్లిసిటీ వ్యవహారాల్లో తనదైన ముద్రను వేశారు. తెలుగు సినీ ప్రముఖులందరితో సన్నిహిత సంబంధాలు కలిగిన బీఏ రాజుకు సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో సౌమ్యుడిగా, అందరికి ఆప్తుడిగా సినీరంగంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు బీఏ రాజు. ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. బీఏ రాజుకు ఇద్దరు కుమారులు అరుణ్‌కుమార్, శివకుమార్ ఉన్నారు.
సినీ ప్రముఖుల సంతాపం
బీఏ రాజు హఠాన్మరణం తెలుగు చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీ ప్రముఖులు, జర్నలిస్ట్‌లు సోషల్‌మీడియా వేదికగా నివాళులర్పించారు.
‘బీఏ రాజు పేరు తెలియని వ్యక్తి ఇండస్ట్రీలో ఉండరు. నా చాలా సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. సినిమాపై అద్భుతమైన పరిజ్ఞానం వున్న వ్యక్తి ఆయన. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’.
– చిరంజీవి
‘నా చిన్నతనం నుంచి ఆయనతో అనుబంధం ఉంది. వృత్తిపట్ల అంకితభావం, సినిమా అంటే అమితమైన ప్రేమ కనబరిచే గొప్ప వ్యక్తిత్వం బీఏ రాజు సొంతం. ఆయన మరణం మా కుటుంబానికి, మీడియారంగానికి పూడ్చలేని లోటుగా భావిస్తున్నా.’
– మహేష్‌బాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

