Shivalayam Movie | ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ ఆవిష్కరణ!
Shivalayam Movie | భక్తి, ఆధ్యాత్మికత మరియు భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న చిత్రం ‘శివాలయం’. శ్రీ శివసాయి ఫిలిమ్స్, శ్రీమతి శ్రీ లక్ష్మినర్సింహారెడ్డి చిత్రాలయం సంయుక్త బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మరియు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.
భక్తి, ఆధ్యాత్మికత మరియు భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న చిత్రం ‘శివాలయం’. శ్రీ శివసాయి ఫిలిమ్స్, శ్రీమతి శ్రీ లక్ష్మినర్సింహారెడ్డి చిత్రాలయం సంయుక్త బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మరియు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుక కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా శివాలయం సెట్‌ను ఏర్పాటు చేయడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి నిర్మాతలు ఈద రవి రాజా, సాయిలక్ష్మణ్ అల్లు, నబీ షేక్, పి.నాగలక్ష్మి, కుప్పిలి శ్రీనివాస ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్, కాంచన దీప్తిరెడ్డి, ధన్‌రాజ్, సుష్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌రెడ్డి నందితో పాటు కళ్లెం నర్సింహారెడ్డి ఈ చిత్రానికి సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
ఈ వేడుకలో నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మించి విడుదల చేయడం సవాలుగా మారినప్పటికీ, దర్శకుడు వెంకట్‌రెడ్డి వరుసగా సినిమాలు రూపొందించి ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. సీనియర్ నటుడు నాగ మహేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తనకు మంచి పాత్రతో పాటు ఓ పాటలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు డ్రమ్స్ రాము మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మొత్తం మూడు పాటలు ఉన్నాయని పేర్కొన్నారు.
హీరో ఆచంట మహేష్ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే చిత్రాన్ని పూర్తి చేయడం సంతోషకరమని, నిర్మాత కళ్లెం నర్సింహారెడ్డి నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న గొప్పవ్యక్తి అని అన్నారు. హీరోయిన్ దీప్తిరెడ్డి, సుష్మ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నటుడు దిల్ రమేష్ మాట్లాడుతూ.. 89 ఏళ్ల వయసులోనూ ఎంతో నిబద్ధతతో సినిమాను నిర్మిస్తున్న నిర్మాత కళ్లెం నర్సింహారెడ్డికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ చిత్రంలో ఘర్షణ శ్రీనివాస్, సమ్మెట గాంధీ, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, మధుమతి కొక్కంటి, ముత్యాల ఉమా, చిట్టిబాబు, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, కళ్లెం నర్సింహారెడ్డి మరియు వెంకట్‌రెడ్డి నంది నిర్మాతలుగా, దరిపల్లి ప్రవీణ్ కుమార్ సహ నిర్మాతగా, వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు; అలాగే ఈ సినిమాకు డ్రమ్స్ రాము సంగీతం, శ్రీశైలం ఎడిటింగ్, డి. యాదగిరి ఛాయాగ్రహణం అందించగా, అశోక్ దయ్యాల పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

