ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘ది లెజెండ్’. ఊర్వశీ రౌటేలా నాయికగా నటిస్తున్నది. లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. జేడీ, జెర్రీ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది. విదేశాల్లో మైక్రోబయాలజీలో డాక్టరేట్ పూర్తి చేసిన ఓ యువకుడు తన స్వగ్రామంలో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చినప్పుడు అక్కడ అతను చూసిన పరిస్థితులు ఏమిటి? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథాంశంగా చూపించబోతున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ను హీరోయిన్ తమన్నా విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న ఆమె చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. వివేక్, యోగిబాబు, సుమన్, నాజర్, విజయ్ కుమార్, ప్రభు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్రాజ్, సంగీతం : హారీస్ జయరాజ్.